ETV Bharat / state

రైల్వే కోడూరులో బొప్పాయి రైతుల ఆందోళన

రైల్వే కోడూరులో బొప్పాయి రైతులు ఆందోళన చేశారు. వ్యాపారులు, దళారులు కుమ్మక్కై.. ధర లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

papaya protest in railway kodur kadapa
papaya protest in railway kodur kadapa
author img

By

Published : Jul 29, 2021, 1:38 PM IST

వ్యాపారులు, దళారులు కుమ్మక్కై.. బొప్పాయిలకు ధర లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ కడప జిల్లా రైల్వే కోడూరు రైతులు ఆందోళనకు దిగారు. లోడింగ్ కోసం వెళుతున్న లారీలను అడ్డుకున్నారు. కరోనాతో తీవ్రంగా నష్టపోయామని.. పరిస్థితులు కుదుటపడి రేట్లు పెరుగుతాయని ఆశించామని.. దళారులు రేట్లు లేకుండా చేస్తున్నారని ఆవేదన చెందారు.

ఇతర రాష్ట్రాల్లో బొప్పాయి కేజీ రూ.20 నుంచి రూ. 40 వరకు పలుకుతుంటే.. రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దళారులు కుమ్మక్కై రోజురోజుకూ రేట్లు తగ్గించి రైతులకు గిట్టుబాటు లేకుండా చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం దళారులను కట్టడి చేయాలని.. బొప్పాయికి సరైన ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ACCIDENT: నిద్ర మత్తులో డ్రైవర్.. లారీ బోల్తా.. పాదచారి దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.