వైకాపా రైతు పక్షపాత ప్రభుత్వమని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా వ్యాఖ్యనించారు. కడప జిల్లా రాజంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్ ప్రమాణ స్వీకరణోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమిటీ ఛైర్మన్‌గా గొబ్బిళ్ళ త్రినాథ్, వైస్ ఛైర్మన్‌గా భాస్కర్ రాజు, కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే ఎక్కువగా రైతుల కోసం జగన్ పాటుపడుతున్నారన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామన్నారు. ఉచిత విద్యుత్‌తో పాటు, వ్యవసాయ మార్కెట్ల ఆధునీకరణ వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీచదవండి