కడప జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. జిల్లాలో 255 మంది (బాలురు 237, బాలికలు 18) బాలలను రెస్క్యూ చేసి.. తల్లిదండ్రులకు అప్పగించారు. ఎస్పీ పర్యవేక్షణలో జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఇతర శాఖల సిబ్బందితో కలిసి ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు.
రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, హోటళ్లు, డాబాలు, గ్యారేజీలు, పరిశ్రమలు, వర్క్ షాపులలో బాలబాలికలను పోలీసులు రెస్క్యూ చేశారు. ఐసీడీఎస్, జిల్లా ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. పోలీస్ అధికారులు బాలబాలికలకు అల్పాహారం, పండ్లు, బిస్కెట్లు అందజేశారు. వారికి కొవిడ్ రాపిడ్ టెస్ట్లు నిర్వహించారు.
ఇదీ చూడండి.