ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణ మహోత్సవం సర్వసాధారణంగా నిర్వహించనున్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి బ్రహ్మోత్సవం వేడుకలు నిరాడంబరంగా చేయనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఈరోజు(7)న రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామి వారి కల్యాణ మహోత్సవం ఏకాంతంగా జరగనుంది. కల్యాణ వేడుకను తిలకించడానికి భక్తులను అనుమతించరు. ఈ క్రతువుని కనులారా వీక్షించేందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. పరిమిత సంఖ్యలో స్వామివారి ముత్యాల తలంబ్రాలను సిద్ధం చేశారు.
ఇదీ చూడండి తల్లి ఆఖరి చూపుకు నొచుకోని కానిస్టేబుల్