కడప జిల్లా బద్వేలు పట్టణంలో రెడ్డయ్యమఠానికి చెందిన ప్రదీప్ ల్యాప్‌టాప్ హార్డ్‌డిస్క్ కోసం.. ఆన్లైన్లో వెతికాడు. అమెజాన్‌లో ఒక హార్డ్‌డిస్క్ నచ్చి ఆర్డర్ పెట్టాడు. పార్శిల్ ఇంటికి రాగానే... రూ.3099 నగదు చెల్లించాడు. పార్శిల్ ఓపెన్ చేసే క్రమాన్ని.. వీడియో చిత్రీకరణ చేశాడు.
అందులో హార్డ్‌డిస్క్ బదులు.. రూ.10 విలువ చేసే రెండు బట్టల సబ్బులను చూసి ప్రదీప్ ఖంగుతిన్నాడు. వెంటనే.. పార్శిల్‌ను తీసుకువెల్లి.. సంబంధిత పార్శిల్ కేంద్ర నిర్వాహకుల వద్దకు తీసుకువెళ్లి ప్రశ్నించాడు. తమకు సంబంధం లేదని నిర్వాహకులు చెప్పటంపై.. బాధితుడు పట్టణ పోలీసులను ఆశ్రయించాడు.
ఇదీ చదవండి: