కడపజిల్లా ప్రొద్దుటూరులో గుర్తు తెలియని 80 ఏళ్ల వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. మైదుకూరు రోడ్డులోని పాండురంగ స్వామి ఆలయం సమీపంలో రోడ్డు డివైడర్ మధ్యలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. వృద్ధురాలికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే రెండో పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: 'కలెక్టర్ రావాలి... మా సమస్యలు తెలుసుకోవాలి'