ETV Bharat / state

అక్రమ నిర్మాణాలపై.. అధికారుల ఉక్కుపాదం - రాయచోటి తాజా వార్తలు

రాయచోటిలోని అక్రమ నిర్మాణాలపై అధికారులు దృష్టి పెట్టారు. 50 ఏళ్లుగా ఆక్రమణలో ఉన్న ఓ ప్రాంతానికి ఇవాళ మోక్షం కలిగించారు. భారీ బందోబస్తు మధ్య అక్కడి నిర్మాణాలను తొలగించారు.

అక్రమ నిర్మాణాల తొలగింపు
author img

By

Published : Oct 28, 2019, 5:58 PM IST

అక్రమ నిర్మాణాల తొలగింపు

కడప జిల్లా రాయచోటి పురపాలికలోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలను ఇవాళ అధికారులు తొలగించారు. పట్టణంలోని జాతీయ రహదారి నుంచి గున్నికుంట్ల వెళ్లే రోడ్డు 50 ఏళ్లుగా ఆక్రమణలో ఉంది. రహదారి ఏర్పాటు చేయాలని స్థానికులు.. పురపాలక అధికారులు, పాలకుల దృష్టికి తీసుకురావటంతో ఆ ప్రాంతాన్ని సర్వే చేయించారు. జాతీయ రహదారి నుంచి ఎస్.ఎన్ కాలనీ వరకు 18 అడుగుల రహదారి ఆక్రమణలో ఉన్నట్లు రికార్డుల్లో తేలింది. అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారికి ఆరు నెలల కిందట అధికారులు నోటీసులు జారీ చేశారు. నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించాలని ఆదేశించారు. అయినప్పటికీ ఎవరు ఖాతరు చేయలేదు. ఎట్టకేలకు పురపాలిక అధికారులు ఇవాళ భారీ బందోబస్తు మధ్య జేసీబీతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి రహదారి ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అక్రమ నివాసాల యజమానులు ఆందోళనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ సుధాకర్​, పురపాలిక కమిషనర్ మల్లికార్జున హెచ్చరికలు జారీ చేశారు. పట్టణంలోని కొత్తపేట, గాలివీడు రోడ్లలో కూడా ఆక్రమణల తొలగింపు చర్యలు చేపడతామన్నారు.

ఇవీ చదవండి
తప్పు చేస్తున్నావని మందలించినందుకు.. కన్నతల్లినే చంపేసింది!
పనుల్లేక.... భార్యబిడ్డలను పోషించుకోలేక చచ్చిపోతున్నా...

Intro:స్క్రిప్ట్ కడప జిల్లా రాయచోటి పురపాలికలు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను సోమవారం రికార్డులు తొలగించారు పట్టణంలోని జాతీయ రహదారి నుంచి గున్నికుంట్ల వెళ్లే రహదారి 50 ఏళ్లుగా ఆక్రమణలో ఉండిపోయింది స్థానికులు రహదారి ఏర్పాటుపై పురపాలక అధికారులు పాలకుల దృష్టికి తీసుకురావడంతో ముందస్తుగా ఆ ప్రాంతాన్ని సర్వే నిర్వహించారు జాతీయ రహదారి నుంచి ఎస్ ఎన్ కాలనీ వరకు 18 అడుగుల రహదారి ఉన్నట్లు రికార్డుల్లో తేలింది ఆక్రమించి భవనాలు నిర్మించిన వారికి ఆరు నెలల కిందట నోటీసులు జారీ చేశారు నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఆదేశాలు పేర్కొన్నప్పటికీ ఎవరు ఖాతరు చేయలేదు ఎట్టకేలకు పురపాలిక అధికారులు సోమవారం భారీ బందోబస్తు మధ్య జెసిబి యంత్రాలు వినియోగించి ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేసి రహదారిని ఏర్పాటుకు చర్యలు చేపట్టారు నివాసాల వారు ఎలాంటి ఆందోళన చేపట్టిన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ స్థలాలు ఆక్రమించడం నేరమని డిఎస్పి సుధాకర్ ర్ పురపాలిక కమిషనర్ మల్లికార్జున లు స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు పట్టణంలోని కొత్త పేట రోడ్డు గాలివీడు రోడ్లలో కూడా ఆక్రమణ తొలగింపు చర్యలు చేపడతామన్నారు ఆక్రమణల తొలగింపు కార్యక్రమం కొనసాగించారు కార్యక్రమంలో పట్టణ సీఐ జి రాజు పురపాలిక ప్రణాళిక అధికారిని ముని లక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు

Body:ఓన్లీ విజువల్స్

Conclusion:ఓన్లీ విజువల్స్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.