ETV Bharat / jagte-raho

తప్పు చేస్తున్నావని మందలించినందుకు.. కన్నతల్లినే చంపేసింది! - crime news

కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లిని.. కన్న కూతురే కిరాతకంగా హతమార్చింది. 'నువ్వు చేసేది తప్పు' అని మందలించిన తల్లినే.. ఆ కర్కశ కుమార్తె కడతేర్చింది. తల్లితో ఉన్న బంధాన్ని మరిచి.. ప్రియుడి సహకారంతో ఈ కిరాతకానికి ఒడిగట్టింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది?

తల్లిని చంపిన కూతురు
author img

By

Published : Oct 28, 2019, 12:15 PM IST

పిల్లలు తప్పు చేస్తే... తల్లిదండ్రులు మందలించడం సహజమే. అలా మంచిని చెప్పడమే ఓ తల్లి ప్రాణం తీసింది. తప్పుడు దారిలో వెళ్లొద్దని అమ్మ చెప్పిన మాటలు నచ్చని కూతురు.. దారుణానికి తెగబడింది. అమ్మ ఒడిలో ఆడుకుని పెరిగిన తన జీవితాన్ని మరిచి... తల్లినే మృత్యు ఒడికి చేర్చింది. తెలంగాణలో జరిగిన ఈ ఘటన.. మానవ సంబంధాల్లో వస్తున్న భయంకరమైన మార్పును తెలియజేస్తోంది.

అసలేం జరిగిందంటే...?

rajitha
మృతురాలు రజిత.. ఫైల్ ఫొటో

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన శ్రీనివాస్​రెడ్డి కుటుంబం.. బతుకుతెరువు కోసం నగరానికి వలస వచ్చి రంగారెడ్డి జిల్లా మునగనూరు​లో జీవనం సాగిస్తోంది. శ్రీనివాస్​ వృత్తి రీత్యా లారీ డ్రైవర్​. కూతురు కీర్తి ఇద్దరు యువకులతో ప్రేమ వ్యవహారం నడిపిస్తోందని తల్లి రజిత (38) గ్రహించింది. తప్పు చేస్తున్నావని కూతురిని మందలించింది.

ప్రియుడితో కలిసి...

తల్లి చెప్పిన మంచిని.. కూతురు సహించలేకపోయింది. మానవత్వాన్ని మరచి... కన్న తల్లినే చంపడానికి పథకం వేసింది. ప్రియుడితో కలిసి తల్లిని చంపేసింది. విషయం బయటికి రాకుండా... తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకుంది. మూడు రోజుల తరువాత మృతదేహాం నుంచి దుర్వాసన వస్తోందని... ప్రియుడి సహాయంతో యాదాద్రి జిల్లా రామన్నపేట సమీపంలో రైలు పట్టాల మీద పడేసింది.

తండ్రికీ అబద్ధమే..

తండ్రికి తాను విశాఖపట్నానికి పర్యటనకు​ వెళ్తున్నానని ఫోన్​ చేసి చెప్పింది. ఇంటి వెనకాల ఉండే మరో ప్రియుడితో ఉన్నట్టు తెలిసింది. లారీ డ్రైవర్​గా డ్యూటీకి వెళ్లిన తండ్రి శ్రీనివాస్​రెడ్డి... డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చాడు. భార్య కనిపించకపోయేసరికి కూతుర్ని నిలదీశాడు. అప్పటికి గానీ అసలు విషయం బయటకు రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా... విచారణలో ప్రియుడితో కలిసి కూతురే తల్లిని చంపినట్లు తేలింది.

ఈ కథనం చదవండి:

ఆ అవ్వకు మరుగుదొడ్డే నివాసం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.