లాక్ డౌన్ కారణంగా కడపలో పోలీసులు కేటాయించిన ప్రాంతాల్లోనే మాంసం విక్రయాలు కొనసాగుతున్నాయి. నగరంలోని సీఎస్ఐ మైదానం, గాంధీ నగర్ పాఠశాల, మున్సిపల్ మైదానం తదితర ప్రాంతాల్లో తెల్లవారుజామునే మాంసం విక్రయాలు ప్రారంభమయ్యాయి. వీటికోసం ప్రజలు బారులు తీరారు. మైదానాలు నిండిపోయాయి. పోలీసులు ఉదయం 9 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చినందున చాలామందికి మాంసం దొరక్క నిరాశగా వెనుదిరిగారు.
ఇవీ చదవండి: