ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా కడపలో రెండు పంచాయతీల్లో ఎన్నికలు జరగడం లేదు. టి.వెలమవారిపల్లె, కె.సుగమంచిపల్లె పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు లేనందున ఎన్నికలు నిర్వహించడం లేదని అధికారులు శనివారం ప్రకటించారు. వేంపల్లె మండలం టి.వెలమవారిపల్లెలో అభ్యర్థుల మధ్య ఏకాభిప్రాయం కుదరక నామినేషన్లు వేసిన వారంతా తిరిగి వెనక్కి తీసుకున్నారు.
టి.వెలమవారిపల్లె ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోని పంచాయతీ కావడం విశేషం. కొండాపురం మండలంలో 4 పంచాయతీలను కలిపి ఒక్కటిగా మార్చడాన్ని నిరసిస్తూ ప్రజలు ఎన్నికలు బహిష్కరించారు. కె.సుగుమంచిపల్లె, కె.బొమ్మేపల్లి, బుక్కపట్నం, దత్తాపురం వేర్వేరుగా ఉండేవి. కె.సుగుమంచిపల్లెలో మిగతా మూడు పంచాయతీలను విలీనం చేసి ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. వేర్వేరు పంచాయతీలుగానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండు చేస్తూ నామినేషన్లు వేయలేదు.
ఇదీ చదవండి: 2022 నాటికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి: డీడీఆర్‌పీ ఛైర్మన్