నివర్ తుపాన్ మిగిల్చిన నష్టం.. ఇప్పటికీ కళ్లెదుట కదలాడుతోంది. తుపాన్ కారణంగా కడప బుగ్గవంక వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అనంతరం కురిసిన వర్షాలకు బుగ్గవంక ప్రాజెక్ట్‌కు భారీగా వరద చేరింది. దీంతో అధికారులు ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. వరద ప్రవాహానికి బుగ్గవంక పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. బుగ్గవంకపై ఉన్న రెండు కాజ్ వేలు వరద ధాటికి తునాతునకలు అయ్యాయి. అక్కడ ఉన్న సిమెంట్ రోడ్డు నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయి రాళ్లు, పైపులు బయటకు కనిపిస్తున్నాయి. స్థానికులకు నడిచేందుకు అవకాశం లేని విధంగా మారింది. ఈ రెండు కాజ్ వేలు దెబ్బతినటంతో కడపలోని రవీంద్ర నగర్ వాసుల అగచాట్లు తప్పడం లేదు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చూడండి...