కడప జిల్లా జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు మే 23 నుంచి 31వ తేదీ వరకు జరుగనున్నాయి. తితిదేకి అనుబంధంగా ఈ ఆలయం ఉంది. మే 22న సాయంత్రం అంకురార్పణం జరుగనుంది. కోవిడ్-19 కట్టడిలో భాగంగా బ్రహ్మోత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు.
మే 23వ తేదీ ఉదయం 9.30 నుంచి 10.30 గంటల మధ్య ధ్వజారోహణం నిర్వహించనున్నారు. 31వ తేదీ ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహన సేవలు జరుగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు నవకలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. జూన్ 1వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తామని ఆలయ పూజారి రాజేష్ తెలిపారు.
ఇదీ చూడండి.