కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో గండికోట, పైడిపాలెం, చిత్రావతి ప్రాజెక్టుల ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 3,017 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ను నిర్మించనున్నట్లు ఎంపీ తెలిపారు. కరవు నివారణ చర్యల్లో భాగంగా రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సీఎం జగన్ ప్రాజెక్ట్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని అన్నారు. అందులో భాగంగా గండికోట నుంచి పైడిపాలెం ప్రాజెక్టు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు నీటిని నింపేందుకు టన్నెల్ నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చాక.. 240 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గండికోటకు 6 నుంచి 10 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని పెంచినట్లు చెప్పారు. ఈ పనులను 18 నుంచి 24 మాసాల్లో పూర్తి చేస్తామన్నారు.
ఇదీ చదవండీ.. brahmamagari pitham: బ్రహ్మంగారి పీఠంపై తెగని పంచాయితీ.. హైకోర్టుకు చేరిన వివాదం!