ఎంపీ మిథున్ రెడ్డి, ఇతర దాతల సహకారంతో కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని ప్రతి పీహెచ్సీకీ రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందచేస్తామని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నాల్గో విడతలో భాగంగా ఇవాళ 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందచేశారు. ఈ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగించుకోవాలని కోరారు. గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సందర్శన సందర్భంగా ఎంపీ ఇచ్చిన హామీ మేరకు 37 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇవ్వగా.. ఇతర దాతలు మరో 7 అందజేశారు.
ఇందుకు గానూ ఎంపీ మిథున్ రెడ్డి, దాతలు గీదర భూషణ్ రెడ్డి, రాయలసీమ ఆనంద రెడ్డిలకు శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ అందించిన రూ. కోటి నిధులతో రాయచోటి ఏరియా ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటు చేయనున్న ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభ మవుతాయన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:
Hanuman birth place: జన్మస్థలంపై కాదు.. వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టండి: చింతామోహన్