ETV Bharat / state

పులివెందుల పట్టణాన్ని పరిశీలించిన ఎంపీ అవినాష్​రెడ్డి - kapada latest news

రాష్ట్ర పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ కమిషనర్ విజయ్​కుమార్, జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. పట్టణ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

officers tour in pulivendula
pulivendula development authority
author img

By

Published : Jun 23, 2020, 3:21 PM IST

పులివెందుల పట్టణాన్ని మోడల్ టౌన్​గా రూపొందించడంలో భాగంగా వివిధ అభివృద్ధి పనులు, కార్యక్రమాలను చేపట్టడానికి మంగళవారం ఉదయం అధికారులతో కలిసి రాష్ట్ర పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ కమిషనర్ విజయ్​కుమార్, జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పాడా అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి ఇటీవల తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఇచ్చిన ఆదేశాల మేరకు… పలు పథకాలకు ప్రణాళికలు రూపొందించి, వాటి అమలుకు సంబంధించి పులివెందులలో పర్యటించారు. పులివెందులను మోడల్ పట్టణంగా రూపొందించడం ముఖ్యమంత్రి ఆశయమని, ఆ మేరకు వేగవంతంగా కార్యాచరణ రూపొందించడంలో భాగంగా అధికారులకు రాష్ట్ర పురపాలక కమిషనర్, కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మొదట కడప రోడ్డులోని గరండాల ఐరన్ బ్రిడ్జి పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండ్, గారేజ్ మార్పు చేసే అంశాలు, మెయిన్ రోడ్డు, ఓల్డ్ బస్టాండ్ ప్రాంతం, పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి గుడి వెనుక వైపు ప్రాంతాన్ని పరిశీలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.