స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం పోలీసులు తనిఖీలు చేపట్టగా, ఓ వాహనంలో బిల్లులు లేని 4 లక్షల 80 వేల నగదను స్వాధీనం చేసుకొన్నారు. నగదు తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 100 మందిని తహసీల్దార్ వద్ద బైండోవర్ చేసినట్లు డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే, కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.
ఇదీ చదవండి: బీటెక్ రవికి పులివెందుల తెదేపా బాధ్యతలు