ETV Bharat / state

తెదేపా పూర్వవైభవానికి ఇదే పునాది: ఎమ్మెల్సీ బిటెక్ రవి - today MLC BTech Ravi latest comments

ఎమ్మెల్సీ బిటెక్ రవి ఆధ్వర్యంలో పలువురు తెదేపా కండువా కప్పుకున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులోని ఎం.కంబాలదిన్నె గ్రామంలో.. ర్యాలీ నిర్వహించిన అనంతరం వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైకాపా ఇక్కడి స్టీల్ ప్లాంట్​ను తరలించటమే కాకుండా.. శిలాఫలకాలను సైతం రెవెన్యూశాఖ అధికారులు తీసుకుపోవడం చాలా దారుణమన్నారు.

MLC BTech Ravi
ఎమ్మెల్సీ బిటెక్ రవి ఆధ్వర్యంలో తెదేపాలోకి చేరిన కార్యకర్తలు
author img

By

Published : Mar 25, 2021, 10:14 AM IST

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలోని ఎం.కంబాలదిన్నె గ్రామంలో ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆధ్వర్యంలో.. దాదాపు 40 కుటుంబాలు తెదేపాలో చేరారు. గ్రామ దేవత మారెమ్మను దర్శించిన అనంతరం.. గ్రామంలో ర్యాలీ చేశారు. పార్టీ జెండాను ఆవిష్కరించి.. జాషువా, నరసయ్య ఆధ్వర్యంలో తెదేపా కండువా కప్పి వారిని పార్టీలో ఆహ్వానించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో తెదేపాకు చెందిన ఇద్దరు బలమైన నాయకులు.. ఇతర పార్టీలలోకి వలస వెళ్లినా.. పార్టీని నమ్ముకుని కార్యకర్తలు ఉన్నారన్నారు. కేంద్రం ఇచ్చిన విభజన హామీలలో భాగంగా.. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఎంపీ రమేష్ నాయుడుతో కలిసి ఆమరణ నిరాహారదీక్ష చేసినట్లు గుర్తు చేశారు. అయితే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కేంద్రం నిధులు విడుదల చేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదన్నారు.

ఇవీ చూడండి...: కడప జిల్లాలో వినాయకుడి విగ్రహం ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.