కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని పతంగే రామన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
నాణ్యంగా చేపట్టాలి..
కొద్ది రోజుల క్రితం ఓ ప్రైవేట్ సంస్థ.. మండలంలోని 22 పాఠశాలల్లో నాడు-నేడు అభివృద్ధి పనులు చేపట్టింది. పతంగే రామన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు, తరగతి గదులు.. తదితర పనులను పరిశీలించి ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. మరికొంత గడువు తీసుకుని నిర్మాణ పనులు నాణ్యంగా చేపట్టాలని సూచించారు.
ఇవీ చూడండి : లాక్‌డౌన్‌లోనూ కొనసాగిన దురాగతం...పసితనంలోనే పసుపుతాడు