గండికోట ముంపు జాబితాకు సంబంధించి.. తెదేపా హయాంలోనే అవినీతి జరిగిందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆరోపించారు. ఆ విషయం తెలుసుకునే వైకాపా ప్రభుత్వం రీసర్వేకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. గురుప్రతాప్ రెడ్డి, రమేష్ రెడ్డి మొదటి నుంచి తెదేపా కార్యకర్తలేనని.. హత్యకు రాజకీయ కారణాలు కాదని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. వారి మధ్య కొన్నేళ్ళుగా భూ వివాదం నడుస్తున్నట్లు వివరణ ఇచ్చారు.
గండికోట సమస్యలపై ఫిర్యాదు చేసింది కూడా వైకాపా కార్యకర్త రామ్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఈనెల 18వ తేదీన పి. అనంతపురంలో పర్యటించిన తెదేపా నిజనిర్ధారణ కమిటీ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతోందని ఆరోపించారు. సర్పంచ్‌గా గెలిచే సత్తా ఒక్కరికీ లేదని.. వారంతా సీఎం జగన్ మోహన్ రెడ్డిని విమర్శించేవారా? అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: అధునాతన గన్ను పరీక్షించిన డీఆర్డీఓ