కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలో ఉన్న ఇసుక రీచ్‌ను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జమ్మలమడుగు ప్రజలకు ఇసుక రీచ్ దగ్గరగా ఉన్నా... మైనింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తువ్వ ఇసుక (కట్టడాలకి పనికి రానిది) డెలివరీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చేసిన తప్పిదం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
జమ్మలమడుగులో 2 రీచ్‌లు ఉండడం వలన... ఏది నిర్మాణాలకు ఉపయోగిస్తారో అధికారులు ప్రజలకు స్పష్టంగా చెప్పాలని సూచించారు. అలా చేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సచివాలయంలో కార్యదర్శి అనుమతి తీసుకుని పెన్నానది నుంచి ఎడ్ల బండ్ల యజమానులు ఇసుకను తీసుకెళ్లవచ్చునని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... : రాష్ట్రంలో కొత్తగా 477 కరోనా పాజిటివ్ కేసులు..ఐదుగురు మృతి