కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భాజపా నాయకులకు సవాల్ విసిరారు. 2024 శాసనసభ ఎన్నికల్లో భాజపా నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ప్రొద్దుటూరులో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని పోటీ చేయాలన్న ఎమ్మెల్యే.. తనకు వచ్చిన ఓట్లలో 25 శాతమైనా ఆయనకు వస్తే.. తాను గెలిచినప్పటికీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
హిందూ మతాన్ని అడ్డుపెట్టుకుని భాజపా నాయకులు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రొద్దుటూరులో మతతత్వ పార్టీల ఆలోచన విధానాలు పని చేయవని ఎమ్మెల్యే అన్నారు. ప్రొద్దుటూరులో విష్ణువర్ధన్ రెడ్డి ధర్నా చేస్తే.. తాను కూడా ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు.
ఇదీ చదవండి: YS Viveka Murder Case: కీలక దశకు వివేకా హత్యా కేసు.. ఆరుగురు అనుమానితుల విచారణ