తన భర్త నందం సుబ్బయ్యను కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారు రెడ్డి చంపించారని అపరాజిత పునరుద్ఘాటించారు. హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే రాచమల్లు... సుబ్బిరెడ్డి కొట్టాలులోని శ్రీ చౌడమ్మ ఆలయంలో ప్రమాణం చేయడంపై ఆమె స్పందించారు. సుబ్బయ్యపై ఎమ్మెల్యే ఆరోపణలు చేయటంపై ఆమె మండిపడ్డారు. చనిపోయిన వ్యక్తి గురించి ఇంత నీచంగా ఎలా మాట్లాడుతారని దుయ్యబట్టారు. నిజాలు చెప్తే చంపేస్తారా అని అపరాజిత ప్రశ్నించారు.
ఇదీ చదవండి