కడప జిల్లా ప్రొద్దుటూరు అబ్కారీ శాఖ అధికారులపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ అమలులో ఉన్నా.. కొందరు వ్యాపారులు మద్యం విక్రయిస్తున్నారని మండిపడ్డారు. పురపాలక కార్యాలయంలోనికి అబ్కారీ అధికారులను పిలిపించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు కరోనా వైరస్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంటే... దీన్నే అదునుగా చేసుకుని కొందరు మద్యం వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఒక్కో క్వాటర్ మద్యం 800 రూపాయలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఒక్కో మద్యం కేసు రూ.35 వేల వరకూ అమ్ముతున్నారని చెప్పారు. ఎక్కడెక్కడ మద్యం అమ్ముతున్నారో అధికారులకు తెలుసని.. చర్యలు తీసుకోకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
ఇవీ చదవండి: