ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ అమలు చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(minister peddireddy news) అన్నారు. బద్వేలులో(badvel by poll 2021) ) జరిగిన పురపాలిక బూత్ కన్వీనర్ల సమావేశంలో మాట్లాడిన మంత్రి.. చంద్రబాబు ఒక్కశాతం అమలు చేస్తే, ముఖ్యమంత్రి జగన్ వంద శాతం నెరవేర్చారని అన్నారు. రెండేళ్లలోనే అన్నివర్గాలకు న్యాయం చేశారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేతలకు ఓట్లు అడిగే ధైర్యం కూడా లేదని వ్యాఖ్యానించారు. బద్వేలు ఉప ఎన్నిక అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు బూతు కన్వీనర్లు అన్ని విధాలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.
బద్వేలు ఉపఎన్నికలో కాంగ్రెస్, భాజపాలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టమెుచ్చినట్లు మాట్లాడితే ప్రజలే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్రమే కాదు.. కేంద్రంలోని భాజపా సర్కార్.. వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని గుర్తు చేశారు.
ఇదీ చదవండి