మధ్యాహ్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ, కనీస వేతనం 18000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సబ్సిడీలో వంట గ్యాస్ సరఫరా చేయాలని కోరారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా స్పందించకపోవడం దారుణమని ఆవేదన చెందారు. నిధులను దారి మళ్ళించి సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడం తగదన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కనీస వేతనం రూ.18వేలు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: