జీవనోపాధి కోసం కువైట్కు వలస వెళ్లిన కార్మికులు... తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్న కార్మికులను.... అధికారులు ప్రత్యేక బస్సుల్లో కడప జిల్లాలోని రాయచోటికి తీసుకొచ్చారు. పట్టణ శివారులోని మాసాపేట ఎస్టీ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో కార్మికులు 14 రోజుల పాటు ఉంటారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. శనివారం వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని నోడల్ అధికారి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కువైట్ నుంచి వచ్చిన వారిలో 70 మంది పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. వారికి వేర్వేరుగా వసతి ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: 'కువైట్లో బతకలేకపోతున్నాం.. దయచేసి మమ్మల్ని ఇంటికి చేర్చండి'