ETV Bharat / state

'నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు'

కడప జిల్లా రాయచోటిలో నిత్యావసర వస్తువుల దుకాణాదారులతో స్థానిక తహసీల్దార్ సమావేశం నిర్వహించారు. కూరగాయలు, సరకులను నిర్ణీత ధరలకే విక్రయించాలని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

meeting with merchants in rayachoti
వ్యాపారులతో సమావేశం నిర్వహించిన రాయచోటి తహసీల్దార్
author img

By

Published : Apr 25, 2020, 2:04 AM IST

ప్రభుత్వం విధించిన లాక్​డౌన్ నిబంధనను వ్యాపారులు పాటించాల్సిందేనని రాయచోటి తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలోని కూరగాయల వ్యాపారులు, చిల్లర దుకాణాల యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. కూరగాయలు, నిత్యావసర వస్తువులను నిర్ణీత ధరలకే విక్రయించాలని ఆదేశించారు. నిబంధనలను అతిక్రమించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణాల ముందు ప్రజలు భౌతిక దూరం పాటించేలా చూడాల్సిన బాధ్యత దుకాణాదారులదేనని స్పష్టం చేశారు.

ఇదీచదవండి.

పదేళ్ల చిన్నారిపై 48 ఏళ్ల వ్యక్తి అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.