కడప జిల్లా ఎర్రగుంట్ల, వీరపునాయునిపల్లె, మండలాల్లోని ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాలకు 75 శాతం మేర పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ ఉల్లిధరలు ఆకాశం అంటుతున్నాయి. ఎర్రగుంట్ల రైతు బజార్ లో మాత్రం చిన్న సైజు ఉల్లి కిలో 40 నుంచి 50 రూపాయల వరకు మరి కొంచెం పెద్ద సైజు 70 నుంచి 80 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు.
ఇంతమేర ధరలు పలుకుతున్నా... రైతన్నల కష్టాన్ని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఓ వైపు తాము కన్నీరు పెడుతుంటే.. దళారులు మాత్రం బాగుపడుతున్నారని ఉల్లి రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని... దళారులకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: