కడప జిల్లా బద్వేల్ పురపాలికలోని చెన్నంపల్లి ప్రగతి నగర్లో విషాదం జరిగింది. అత్తింటి వేధింపులు తాళలేక దీపిక అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నాలుగేళ్ల కిందట దీపికకు అదే గ్రామానికి చెందిన రూబెన్తో వివాహం జరిగింది. పెళ్లైనప్పటి నుంచి భర్తతో పాటు అత్త, ఆడబిడ్డలు అనుమానం పెట్టుకొని వేధించేవారు. నిన్న రాత్రి భర్త రూబెన్...దీపికతో గొడవపడ్డాడు. ఇతనితో పాటు అత్త, ఆడబిడ్డలు ఆమెను మానసికంగా వేదనకు గురిచేశారు. దీన్ని భరించలేని దీపిక గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన కుమార్తె మృతికి భర్త, అత్త, ఆడబిడ్డలే కారణమని మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: