వరదల కారణంగా నివాసాల్లోకి భయంకరమైన విష సర్పాలు వస్తున్నా.. అధికారులు స్పందించకపోవటంతో కడప అంబా భవాని వీధికి చెందిన ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. తన ఇంట్లోకి ఇటీవల రక్తపింజరి పాము చొరబడింది. ఆ పామును చంపి తన ఇంటి ఎదుట వేలాడదీశాడు. బుగ్గవంక వరద ప్రవాహంతో నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ మేరకు పలు విషసర్పాలు నివాసాల్లోకి వస్తున్నప్పటికీ అధికారులు స్పందించలేదని ఆరోపిస్తున్నాడు.
అధికారుల తీరుకు నిరసనగా తన ఇంట్లోకి వచ్చిన పామును చంపి.. ఇంటి ఎదుట వేలాడదీసినట్లు తెలిపాడు. అధికారులు నామమాత్రంగా స్పందిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో అధికారులు చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. వరద ప్రాంతాల్లో పర్యటించి, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి...