కడప జిల్లా చాపాడు మండలం సీతారామపురం వద్ద కుందూనది పాత వంతెనపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి సురభి మహేష్ (45) అనే వ్యక్తి మృతిచెందారు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు సోమవారం తెల్లవారుజామున మహేష్ సొంత పనిపై ద్విచక్ర వాహనంపై సీతారామపురం వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ సందర్భంగా వంతెనపై నుంచి కింద పడిపోయారు. తెల్లవారాక నదిలో ద్విచక్ర వాహనం, మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వంతెనపై భారీ వాహనం ఒక్కటే రావాల్సి ఉంది. ఎదురుగా వచ్చేందుకు వీల్లేదు. చీకట్లో చలి తీవ్రత ఉన్న సమయంలో నదిలో పడిపోయినట్లు భావిస్తున్నారు. మృతుడి కుమారుడు సురేష్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
కుందూ నదిలో పడి వ్యక్తి మృతి - kadapa district newsupdates
చాపాడు మండలం సీతారామపురం వద్ద కుందూనది పాత వంతెనపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి సురభి మహేష్ అనే వ్యక్తి మృతిచెందారు. మృతుడి కుమారుడు సురేష్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
![కుందూ నదిలో పడి వ్యక్తి మృతి Man dies after falling into Kundu river](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10645323-369-10645323-1613454117648.jpg?imwidth=3840)