కడప జిల్లా రామాపురం మండలం కొండారెడ్డిగారి పల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రాయచోటి వైపు నుంచి కడప వెళ్తున్న కారు... ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. స్కూటీపై వెళ్తున్న షేక్ సౌత్ వలి (28) అనే వ్యక్తి.. తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.
మృతుడు కడపలోని అశోక్ నగర్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: