ETV Bharat / state

'ప్రశ్నిస్తే దాడులు.. పోలీసు కేసులా..!' - తొగటవీర క్షత్రియులు ఆందోళన

MADANAPALLE YSRCP MLA SAY SORRY: వైఎస్సార్సీపీ సర్కార్ చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అడుగడుగున ప్రశ్నల వర్షంతో స్వాగతం పలుకుతున్నారు. ఆ యువకుడు వారి సమస్యల గురించి ఎమ్మెల్యే ముందు ఉంచారు. అంతే అది నచ్చని ఎమ్మెల్యే రాజరెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేసి అధికార ప్రతాపాన్ని వారి కుటుంబం చూపించారు. వారికి అధికార ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని తొగట వీర క్షత్రియ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ డిమాండ్ చేశారు.

Madanapally MLA Nawaz Bhasha
మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ భాష
author img

By

Published : Feb 9, 2023, 8:43 PM IST

MADANAPALLE YSRCP MLA SAY SORRY: వైఎస్సార్సీపీ సర్కార్ ప్రశ్నించే వారికి నోటితో సమాధానం చెప్పకుండా చేతులతో సమాధానం చెప్తూ ప్రజలను భయాబ్రాంతుకు గురి చేస్తున్నారు. ప్రజలు వారి సమస్యలను చెప్పకోవాలంటేనే జంకుతున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లా మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వీర క్షత్రియ కులస్తుడు, చేనేత కార్మికుడు లక్ష్మీనారాయణ ప్రశ్నించాడనే కోపంతో అతనిపై దాడి చేసి వారి కుటుంబంపై అక్రమంగా కేసులు బనాయించి పోలీస్ స్టేషన్​కు తరలించారు. విషయం తెలుసుకున్న వైయస్సార్ జిల్లా తొగట వీర క్షత్రియ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ ఈ దాడిని ఖండించారు.

జగన్​మోహన్ రెడ్డి మీ ఎమ్మెల్యేలను దాడులకు పాల్పడకుండా చూసుకోండి: సుధాకర్

ప్రశ్నించడం నేరమా?: ప్రశ్నించే గొంతుకలపై వైసీపీ సర్కార్ దాడులు చేయడం తగదని, ముఖ్యమంత్రి జగన్ ​మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలను దాడులకు పాల్పడకుండా చూసుకోవాలని ఆయన కడప ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ భాష రెండు రోజుల క్రిందట గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తొగట వీర క్షత్రియ కులస్తుడు, చేనేత కార్మికుడు లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేను ప్రశ్నించారని ఉద్దేశంతో అతనిపై దాడి చేసి అతని కుటుంబ సభ్యులు మొత్తాన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం తగదని ఖండించారు.

హెచ్చరిక: పోలీస్ స్టేషన్​లో దాదాపు 6 గంటల పాటు అక్రమంగా నిర్బంధించి అమానుషంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రశ్నించిన మాత్రాన ఇలా దాడులు చేయడం తగదని ఖండించారు. మదనపల్లి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని లేదంటే తొగటవీర క్షత్రియులు ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఏమీ జరిగింది: అన్నమయ్య జిల్లా మదనపల్లి పురపాలక సంఘం నీరువారిపల్లిలో శుక్రవారం రాత్రి నిర్వహించిన గడప గడపకు కార్యక్రమలో వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే ఎం నవాజ్ బాషా గ్రామంలో గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తుండగా.. వైసీపీ సానుభూతిపరుడు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి రోడ్డు సమస్యపై ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. తమ కాలనీలో ఉన్న రోడ్డుపై మరో రోడ్డు నిర్మిస్తే ఇప్పుడు ఉన్న ఇళ్లు ఎత్తు తగ్గుతుందని విన్నమిస్తూ.. ఎమ్మెల్యే చేయి పై అభిమానంతో చేయి వేశాడని స్థానికులు తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే అతనిపై చేయి చేసుకున్నాడని వారు అంటున్నారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు లక్ష్మీనారాయణను మదనపల్లి వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్​ స్టేషన్​కు తరలించారు. మరో వైపు తొగటవీర క్షత్రియ సంఘం నాయకులు గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి మాట్లాడారు ఈ సమయంలో అక్కడ తోపులాడు జరిగింది. ఎమ్మెల్యే తీరుపై గ్రామస్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే తీరును గ్రామస్థులు తప్పుబడుతున్నారు. సమస్య గురించి చెప్తే ఇలా చేయి చేసుకుంటారా అని ప్రశ్నించారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.