ETV Bharat / state

రాయచోటిలో స్థానిక ఎన్నికల నామినేషన్లు ప్రారంభం - స్థానిక సంస్థల ఎన్నికల తాజా న్యూస్

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ మెుదలైంది. కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పలు మండలాల్లో నామినేషన్లు దాఖలయ్యాయి.

రాయచోటిలో స్థానిక ఎన్నికల నామినేషన్లు ప్రారంభం

author img

By

Published : Mar 9, 2020, 10:19 PM IST

రాయచోటిలో స్థానిక ఎన్నికల నామినేషన్లు ప్రారంభం

కడప జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పలు మండలాల్లో నామినేషన్లు దాఖలయ్యాయి. గాలివీడు మండలంలోని గరుగుపల్లి ఎంపీటీసీ స్థానానికి తెదేపా తరపున బత్తిన జయలక్ష్మమ్మ, కాల్వపల్లి సుశీలమ్మలు నామినేషన్ వేశారు. అదే మండలంలోని కొర్లకుంట ఎంపీటీసీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా యశోదమ్మ, చిన్నమండెం మండలం కేశపురం ఎంపీటీసీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా రేణుక నామినేషన్ వేశారు. రామాపురం మండలంలోని రాచపల్లి ఎంపీటీసీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి, నీలకంఠరావు పేట ఎంపీటీసీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా నాగరాణి నామినేషన్ వేశారు. తొలిరోజు రాయచోటి, సంబేపల్లి, లక్కిరెడ్డిపల్లి మండలాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. నామినేషన్ల కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి:

రైల్వేకోడూరులో స్థానిక సంస్థల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.