ETV Bharat / state

పింఛన్ల కోసం కుష్టు బాధితుల నిరసన - రైల్వేకోడూరులో కుష్టు వ్యాధిగ్రస్తుల నిరసన

కడప జిల్లాలోని రైల్వేకోడూరు మండల పరిషత్ కార్యాలయాన్ని కుష్టు బాధితులు ముట్టడించారు. ప్రభుత్వం తమకు పెన్షన్లను తొలగించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

leprosy people protest at kadapa district railway kodur MPDO office
రైల్వేకోడూరులో కుష్టు వ్యాధిగ్రస్తుల నిరసన
author img

By

Published : Dec 18, 2019, 7:01 PM IST

రైల్వేకోడూరులో కుష్టు బాధితుల నిరసన

కడప జిల్లా రైల్వేకోడూరులోని మండల పరిషత్ కార్యాలయాన్ని కుష్టు బాధితులు ముట్టడించారు. ప్రభుత్వం తమ పెన్షన్లను తీసి వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవో కార్యాలయంలోనికి అధికారులను ఎవరినీ ప్రవేశించకుండా...పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1977 నుంచి ప్రభుత్వం పెన్షన్లు ఇస్తూ ఉంటే ఇప్పుడున్న వైకాపా ప్రభుత్వం... వాటిని తొలగించడం దారుణమన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించేందుకు వెనకాడబోమని చెప్పారు.

రైల్వేకోడూరులో కుష్టు బాధితుల నిరసన

కడప జిల్లా రైల్వేకోడూరులోని మండల పరిషత్ కార్యాలయాన్ని కుష్టు బాధితులు ముట్టడించారు. ప్రభుత్వం తమ పెన్షన్లను తీసి వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవో కార్యాలయంలోనికి అధికారులను ఎవరినీ ప్రవేశించకుండా...పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1977 నుంచి ప్రభుత్వం పెన్షన్లు ఇస్తూ ఉంటే ఇప్పుడున్న వైకాపా ప్రభుత్వం... వాటిని తొలగించడం దారుణమన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించేందుకు వెనకాడబోమని చెప్పారు.

ఇదీ చదవండి:

వ్యక్తి హత్య కేసులో యూపీకి చెందిన నలుగురి అరెస్టు

Intro:కడప జిల్లా రైల్వేకోడూరులో మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించిన కుష్టు వ్యాధిగ్రస్తులు వాటి వివరాలు.


Body:రైల్వేకోడూరు టౌన్ లోని మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించిన కుష్టు వ్యాధిగ్రస్తులు. తమ పెన్షన్లను తీసి వేస్తున్నారని ఆగ్రహంతో ఎంపీడీవో కార్యాలయంలోనికి అధికారులను ఎవరిని పంపించకుండా తలుపులకు అడ్డంగా నిలబడి తమ పెన్షన్లు తమకు ఇవ్వాలని నినాదాలు చేస్తూ ఎంపీడీవో ఆఫీస్ ఎదుట రైల్వేకోడూరులో కుష్టు వ్యాధిగ్రస్తులు అందరూ కూర్చుని నినాదాలు చేస్తున్నారు. 1977 నుంచి మాకు పెన్షన్లు ఇస్తూ ఉంటే ఇప్పుడున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మా పెన్షన్లను తొలగించడం చాలా దారుణం అన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఏ ముఖ్యమంత్రి చేయని పనులు ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మా పెన్షన్లను తొలగించడం దారుణమని తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టక ముందు నుండి కూడా మాకు పెన్షన్లు ఇస్తూ ఉంటే వారి తండ్రిగారైన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కూడా మా పెన్షన్ ను తొలగించకుండా ఉంటే ఇప్పుడు వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మా పెన్షన్లను తొలగించడం చాలా దారుణమని వారు తెలిపారు. మా పెన్షన్లు పునరుద్ధరించి మమ్మలను కాపాడాలని వారు కోరారు .లేనిపక్షంలో ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించేందుకు లేదా ఆత్మహత్య చేసుకునేందుకు మేము వెనకాడబోమని వారు తెలిపారు.

బైట్స్. 1. ధనంజయ, కుష్టు వ్యాధిగ్రస్తులు
2. కుమారి, కుష్టి వ్యాధి గ్రస్తులు
3. mehrunisa, కుష్టు వ్యాధిగ్రస్తులు రాలు.


Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.