కడప నగరంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బుగ్గవంక సుందరీకరణ పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా 14 కోట్ల రూపాయలతో బుగ్గవంకలో 5 కిలోమీటర్ల మేర కాల్వకు రెండు వైపుల రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాదిలో కడప సుందర నగరంగా మారనుందని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సహకారంతో రూపు రేఖలు మారుబోతున్నాయన్నారు.
అనంతరం 5 కోట్ల రూపాయలతో చేపట్టనున్న మైనారిటీ విద్యార్థుల ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ వసతి గృహాల నిర్మాణానికి కూడా నేతలు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారని కడప ఎంపీ వై.ఎస్.అవినాశ్ రెడ్డి అన్నారు. కడప సుందరీకరణలో భాగంగా తొలి అడుగు పడిందని.. ఇంకా 8 రహదారులను విస్తరించేందుకు టెండర్ల ప్రక్రియ త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. కొప్పర్తి పారిశ్రామికవాడ అభివృద్ధికి ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో పనిచేస్తున్నారన్నారు.
ఇవీ చదవండి: 'జగనన్న తోడు'పై కడప జాయింట్ కలెక్టర్ సమీక్ష