కరోనా కాలంలో విధులు నిర్వహించేందుకు జూన్లో 25 మంది ల్యాబ్ టెక్నీషియన్లను కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విధుల్లోకి తీసుకున్నారు. ఇంతవరకు వారు కొవిడ్ విధులు నిర్వహించారు. అయితే ఉన్నపళంగా వారందరినీ విధుల్లోంచి తొలిగించారు. దీంతో వారంతా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఆందోళనకారుల్లో ఒకరు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయటంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అప్రమత్తమైన పోలీసులు సదరు వ్యక్తిని అడ్డుకున్నారు. మరోవైపు తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని టెక్నీషియన్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆరు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, 31 మందికి ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తమను కాదని వేరేవాళ్లకు ఆ ఉద్యోగాలు కేటాయిస్తే మూకుమ్మడిగా ఆత్మహత్యలకు పాల్పడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇవీ చూడండి...