Brahmotsavalu: వైఎస్‌ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. సోమవారం రాత్రి స్వామివారు హంసవాహనంపై ఊరేగారు. ఆలయం చుట్టూ తిరిగిన హంస వాహనసేవ ...ఒంటిమిట్ట పురవీధుల గుండా సాగింది. హంస వాహనం లో ఊరేగుతున్న శ్రీరాముని తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వాహన సేవ ముందు భక్తులు కోలాటాలతో అలరించారు.
Brahmotsavalu: ఒంటిమిట్ట కోదండరాముడి కోవెలలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం జగదభిరాముడు వేణుగాన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఏకశిలానగరి వీధుల్లో పురుషోత్తముడి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. 15వ తేదీ రాత్రి సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు తితిదే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేయడానికి 2 లక్షల పొట్లాలు సిద్ధం చేస్తున్నట్లు డిప్యూటీ ఈవో తెలిపారు.
కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 15న జిల్లాలో పలుచోట్ల నుంచి ఒంటిమిట్టకు 135 బస్సులు నడపనున్నారు. ఒంటిమిట్ట నుంచి కల్యాణ వేదిక వరకు 4 ఉచిత బస్సు సర్వీసులు ఉంటాయి. కడప నుంచి ఒంటిమిట్టకు అత్యధికంగా 35 బస్సులు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: తిరుపతిలో వైభవంగా.. సీతారాముల కల్యాణం