మద్యం, ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కొత్తగా రూపొందించిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులను ప్రభుత్వం నియమించింది. కడప జిల్లా ఎస్ఈబీ అదనపు ఎస్పీగా కె. చక్రవర్తి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. కడప ఎస్పీ అన్బురాజన్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు. అనంతరం ఎక్సైజ్, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో మద్యం, ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేస్తామని, నిబంధనల మేరకే ఇసుక రవాణా జరుగుతుందన్నారు. నిబంధనలు అతిక్రమించి అక్రమ రవాణాకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : వలస కార్మికులపై పోలీసు 'లాఠీ' కాఠిన్యం