ETV Bharat / state

KC Canal Farmers Facing Irrigation water Issue: కరవు చేరువలో సీమ.. ఖాళీగా జలాశయాలు.. ఆందోళనలో అన్నదాతలు

KC Canal Farmers Facing Irrigation Water Issue: వానకాలం ప్రారంభమై నెలలు గడుస్తున్నా.. వరినాట్లు వేయలేదని సీమ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేక నాట్లు ఆలస్యమైనా.. కేసీ కెనాల్​ తమను రక్షిస్తుందని భావిస్తే నిరాశే మిగిలిందని ఆందోళన చెందుతున్నారు. వరి సాగు చేయెద్దని అధికారులు మౌఖికంగానే చెబుతున్నారు. నారు పోసి నెలలు గడుస్తున్నా నాట్లు వేయలేదని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

KC_Canal_Farmers_Facing_Irrigation_Water_Issue

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2023, 10:21 AM IST

KC Canal Farmers Facing Irrigation water Issue: కరవు చేరువలో సీమ.. వర్షాలు లేక జలాశాయల నీళ్లందకా.. కొట్టుమిట్టాడుతున్న అన్నదాత

KC Canal farmers Facing Irrigation Water Issue: ఆగస్టు నెల ముగిసిన కూడా వర్షం జాడ లేకపోవడంతో రాయలసీమలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. శ్రీశైలం జలాశయంలోకి నీరు రాకపోవడంతో.. కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయలేదు. ఫలితంగా 85వేల హైక్టార్ల ఆయకట్టు బీళ్లుగా కనిపిస్తోంది. దీంతో ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఏం చేయాలో తెలియడం లేదంటూ అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయం నిండితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కర్నూలు, కడప జిల్లాల్లో వరి పంట సాగు చేసే ఆయ కట్టుకు నీరందించే పరిస్థితి ఉండేది. కానీ జలాశయంలో నీరు లేకపోవడంతో కర్నూలు-కడప కాల్వకు నీళ్లు వదలడం లేదు. ఏటా ఆగస్టు మొదటి వారం నుంచే వరినాట్లకు సిద్ధమయ్యే రైతులు నీటి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

చివరి దశలో పంటకు అందని నీళ్లు.. కేసీ కెనాల్‌ రైతుల ఆందోళన

"పైన జలాశయంలో నీళ్లు లేవంటున్నారు. అధికారులు కాల్వలకు తూములు తీయకూడదని చెప్తున్నారు. అందువల్ల జొన్న పంటను సాగు చెద్దామని అనుకున్నాము. ఎమైనా వర్శాలు పడి కేసీ కాల్వకు నీళ్లు వస్తే జొన్న పంటైనా పండుతుంది." - రైతు

"పోసిన నారు ఎండబెట్టుకున్నారు. పంటల కోసం అధికారులు నీళ్లు వద్దంటున్నారు. మెట్ట పంటలు సాగు చేసుకొండి నీళ్లు ఇస్తామని అధికారులు అంటున్నారు." - రైతు

'నీటి సరఫరా విషయంలో స్పష్టత ఇవ్వాలి'

కేసీ కాల్వకు నీరు వదలుతారనే ఉద్దేశంతో రెండు నెలల నుంచి భూములను దుక్కి దున్నిన రైతులకు నిరాశే మిగిలింది. కాలువ కింద ఒక్క కడప జిల్లాలోనే దాదాపు 80 వేల ఎకరాల ఆయుకట్టులో వరి పంట సాగు చేస్తున్నారు. ఈసారి నీరు రాకపోవడంతో నారుమళ్లు కూడా ఎండిపోతున్నాయంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట నుంచి పెన్నానది నీటిని కడప వాసుల తాగునీటి కోసం కేసీ కాలువ ద్వారా చెరువుకు వదిలారు. ఇవి తాగునీటి కోసమేనని రైతులెవ్వరూ వరిపైరు వేసుకోవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేసీ ఆయకట్టుకు శాశ్వత తాగునీటి అవసరాలను తీర్చడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిన గుండ్రేవుల ప్రాజెక్టును ప్రభుత్వం విస్మరించడంతోనే సమస్య జఠిలమైందని రైతులు మండిపడుతున్నారు. నీరు వదిలే అవకాశం ఉండదని అధికారులు మౌఖికంగానే తేల్చి చెప్పడంతో.. ఇప్పటికే వరినాట్లు వేసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఖర్చు చేసిన డబ్బంతా.. బూడిదలో పోసిన పన్నీరైందంటూ కన్నీరు పెడుతున్నారు.

'కేసీ కాలువ లైనింగ్ పునరుద్దరణ పనులను చేపట్టాలి'

''పండుతుందనే ఆశతో నాటు వేస్తున్నాము. వర్షం పడుతుందనే నమ్మకంతో వరి నాటు వేస్తున్నాము. ఎకరానికి 25వేల వరకు ఖర్చు వస్తోంది. అప్పుడు వర్షాలు రావటంతో నారు పోశాము. ఇప్పుడు ఎటూ కానీ పరిస్థితి వచ్చింది." - రైతు

"మేము అగస్టులో నీళ్లు వదలటంతో నారు పోశాము. నీళ్లు వస్తాయని పోశాము.. ఇప్పుడు అధికారులు నీళ్లు రావని అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు." - రైతు

No Rains in Anantapur District: చినుకు జాడ లేదయే.. సాగు చేసేది ఎలా..? ఉమ్మడి అనంత రైతన్న ఆవేదన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.