ETV Bharat / state

తెదేపా కడప మేయర్ అభ్యర్ధిగా రషీదా తబసుమ్ - kasapa dst tdp mayor candidate name disclose

కడప నగరపాలక సంస్థ ఎన్నికల్లో.. తెదేపా మేయర్ అభ్యర్థి ఖరారయ్యారు. 29వ వార్డు డివిజన్​కు పోటీ చేస్తున్న రషీదా తబసుమ్​ను ఎంపిక చేశామని పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు.

kasapa dst tdp mayor candidate name disclose
కడప జిల్లా మేయర్ అభ్యర్ధిని ప్రకటించిన తెదేపా
author img

By

Published : Mar 14, 2020, 7:30 PM IST

కడప జిల్లా మేయర్ అభ్యర్ధిని ప్రకటించిన తెదేపా

బీసీలకు రిజర్వ్ అయిన కడప మేయర్ స్థానానికి.. తమ పార్టీ అభ్యర్థిగా రషీదా తబసుమ్​ను తెదేపా ప్రకటించింది. ఆమె.. 29వ వార్డు నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కడప నగరంలో దాదాపు 40 శాతం పైగా ఉన్న ముస్లింలు... తెదేపా మేయర్ అభ్యర్థిని బలపరచాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నగరపాలక సంస్థలో అన్ని డివిజన్లలో తమ పార్టీ పోటీ చేస్తోందని తెలిపారు. పోలీసు అధికారులే తమ అభ్యర్థులకు ఫోన్లు చేసి.. నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు.. వైకాపా నుంచి మేయర్ అభ్యర్థిగా సురేశ్ బాబు బరిలో ఉన్నారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో పోలీసు టెర్రరిజం కొనసాగుతోంది: చంద్రబాబు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.