బద్వేల్లో అటవీ ముఖ్య సంరక్షణ అధికారి కూంబింగ్ - బద్వేల్లో కర్నూలు అడవి ముఖ్య సంరక్షణ అధికారి కూంబింగ్
ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి గట్టి చర్యలు తీసుకోవాలని కర్నూలు అటవీ ముఖ్య సంరక్షణ అధికారి గోపీనాథ్ కోరారు. కడప జిల్లా బద్వేల్ అటవీ ప్రాంతంలో ఆయన పర్యటించారు. వేసవిలో అడవులు... నిప్పుల బారినపడకుండా సంరక్షించాలని సూచించారు. కడప, ప్రొద్దుటూరు డీఎఫ్ఓ శివ ప్రసాద్, గురు ప్రభాకర్తో 10 కిలోమీటర్ల దూరం కూంబింగ్ నిర్వహించారు. అనంతరం బాలాయపల్లిలో నీటి కుంటలు పరిశీలించారు.