వైయస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని హైదర్‌ఖాన్‌వీధిలో ముగ్గురిని హత్య చేసిన కేసులో కరీముల్లాకు ఉరిశిక్ష విదిస్తూ ప్రొద్దుటూరు రెండో అదనపు జిల్లా జడ్జి కోర్టు తీర్పునిచ్చింది. భార్యతో విడాకులు ఇప్పించేందుకు సహకరించలేదన్న కోపంతో కరీముల్లా గతేడాది ఏప్రిల్ 26న తెల్లవారుజామున తల్లి గుల్జార్‌బేగం, గర్భిణిగా ఉన్న సోదరి కరీమున్నిసా, తమ్ముడు మహమ్మద్ రఫీని రోకలిబండతో మోది హత్యే చేశాడు. ఈ కేసులో కరీముల్లా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. హత్యలు తానే చేసినట్లు అంగీకరించడంతో ఉరి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామప్రసాద్‌రెడ్డి తెలిపారు. శిక్షను అమలు చేయాలంటే హైకోర్టు ధ్రువీకరించాలని వివరించారు. కేసుకు సంబంధించి మొత్తం 21మంది సాక్షులను విచారించిన జడ్డి, ఈ తీర్పు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
ఇవి చదవండి: