కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రానికి ఉపయోగపడే సంక్షేమ పథకాల ఊసే బడ్జెట్లో లేవన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సాయం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. కేంద్రం ఏపీకి సహకరించకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
ఇదీ చదవండి : 'నవరత్నాలు అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం'