కడప జిల్లాలో వైకాపా నాయకులు, పోలీసులు కలిసి తెదేపా అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయకుండా బెదిరిస్తున్నారని తెదేపా కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాయచోటి మున్సిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారుల ఎదుటే తెదేపా అభ్యర్థుల నామినేషన్ పత్రాలను వైకాపా కార్యకర్తలు చించేశారని మండిపడ్డారు. ఇంతటి అరాచక రాజ్యం ఎన్నడూ చూడలేదన్నారు. మైదుకూరు నియోజకవర్గంలో ఏడుగురు తెదేపా ఎంపీటీసీలు, జడ్పీటీసీలను వైకాపా నాయకులు కిడ్నాప్ చేసి రాత్రంతా నల్లమలలో ఉంచారని పుట్టా సుధాకర్ యాదవ్ ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. బ్రహ్మంగారిమఠం మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
ఇవీ చదవండి.. రెండు దశాబ్దాల తర్వాత ఆ గ్రామంలో ఎన్నికలు!