కడప కేంద్రకారాగారంలో కరోనా చికిత్స పొందుతున్న 360 మంది ఖైదీల్లో 349 మంది కోలుకున్నారు. ఇంకా 11 మందికి చికిత్స అందిస్తున్నారు. ఓ రిమాండు ఖైదీ నుంచి మొదలైన కరోనా 360 మంది ఖైదీలకు కరోనా సోకింది. వారందరినీ జైల్లోనే ప్రత్యేక గదుల్లో ఉంచి వైద్యo అందించారు. వేడి నీళ్లు, మంచి పౌష్టికాహారంతో పాటు మంచి మందులు ఇచ్చారు. ఎప్పటి కప్పుడు వారి ఆరోగ్యం పై జైలు అధికారులు తెలుసుకొని ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ మేరకు 349 మంది ఖైదీలు సంపూర్ణంగా కోలుకున్నారు. మిగిలిన 11 మంది కోలుకుంటున్నారు. వారు కూడా మరో రెండు రోజుల్లో కోలుకుంటారని జైల్ అధికారి రవి కిరణ్ తెలిపారు.
ఇదీ చదవండి: రాజ్యసభ: న్యాయవ్యవస్థపై విజయసాయి వ్యాఖ్యల తొలగింపు