ETV Bharat / state

జిల్లాలో మొదటిరోజు కొనసాగిన నామినేషన్లు - కడప పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైంది. నామినేషన్​ వేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. మైదుకూరు మండలం అన్నలూరులో శివపురం పంచాయతీకి తొలి నామినేషన్‌ దాఖలైంది.

kadapa elections
కడప జిల్లాలో నామినేషన్ల పర్వం ప్రారంభం
author img

By

Published : Jan 29, 2021, 6:48 PM IST

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. నామినేషన్‌ వేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తనిఖీల అనంతరం నామినేషన్‌ కేంద్రంలోకి ప్రవేశించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. మైదుకూరు మండలం అన్నలూరు క్లస్టర్‌లోని శివపురం పంచాయతీకి తొలి నామినేషన్‌ దాఖలైంది.

బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లోని 14 మండలాల్లో 206 గ్రామ పంచాయతీలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 97 నామినేషన్ కేంద్రాల్లో అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అనంతరాజపురం నుంచి వెంకటసుబ్బమ్మ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

ప్రొద్దుటూరులో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మండల పరిధిలో మొత్తం 15 పంచాయతీలకు ఎన్నిక జరగనుంది. ప్రొద్దుటూరు మండల పరిధిలో మొత్తం పది నామినేషన్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కొత్తపల్లె పంచాయతీకి వైకాపా మద్దతుదారుడు కొనిరెడ్డి శివచంద్రరెడ్డి నామినేషన్ వేశారు.

ఇదీ చదవండి: "క్లియరెన్స్ సర్టిఫికెట్​లు ఇవ్వటం లేదు"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.