కడప జిల్లాకు చెందిన వలస కార్మికులు... మహారాష్ట్రలో చిక్కుకుని కటిక ఇబ్బంది పడుతున్నారు. కొందరు వివిధ రకాల పనులు చేస్తూ, మరికొందరు ప్రైవేటు ఉద్యోగాలతో కాలం నెట్టుకొచ్చేవారే. "లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి బయటికి వెళ్లనివ్వకుండా మమ్మల్ని ఓ గదిలో పెట్టారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎవరూ పట్టించుకోవడం లేదు. మమ్మల్ని మా తల్లిదండ్రుల వద్దకు పంపించండి. మేమంతా ఇక్కడ 500 మంది ఉన్నాం. మమ్మల్ని మా సొంత ఊళ్లకు పంపించండి. లేదంటే మాకు ఇబ్బందులు తీవ్రమవుతాయి" అంటూ నరసింహ అనే వ్యక్తి ఈనాడు - ఈటీవీ భారత్ విలేకరికి ఫోన్‌లో వివరించారు. ఈ సమాచారాన్ని అంటూ కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కూ తెలియజేశామన్నారు. త్వరగా తమ సమస్య పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండి: