ప్రభుత్వం జారీ చేసిన నియమ నిబంధనల మేరకు... కడప జిల్లాలోని 12 మార్కెట్ యార్డుల చైర్మన్లకు జిల్లా అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. మంత్రులు ఆదిమూలపు సురేశ్, అంజాద్ బాషా సమక్షంలో.. జిల్లా కలెక్టర్ హరికిరణ్ లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. 12 మార్కెట్ యార్డులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని... 13వ యార్డు ఎర్రగుంట్లను త్వరలోనే ఎంపిక చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఇందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించినట్లు వివరించారు. రిజర్వేషన్లు పొందిన మార్కెట్ యార్డు ఛైర్మన్ల లిస్టును విడుదల చేశారు.
ఇవీ చదవండి...పచ్చదనంతో కళకళలాడుతున్న కారాగారం