కడప జిల్లా అల్లూరి సీతారామరాజు నగర్‌కు చెందిన శ్రీలేఖ అనే హిజ్రా ఐదు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈమె మరణంపై సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో వస్తున్న కథనాలతో కడప హిజ్రాల సంఘం సభ్యులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ప్రియుడు మోసం చేశాడన్న కారణంతోనే శ్రీలేఖ ఆత్మహత్యకు పాల్పడిందే తప్ప.. ఇతరత్రా కారణాలు లేవని హిజ్రాల సంఘం సభ్యురాలు సాగరిక తెలిపారు. ఆమె మరణం వెనుక మిస్టరీ దాగి ఉందని వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని ఖండించారు. ఒకరిని బలవంతంగా హిజ్రాలుగా మార్చే పనులు ఎప్పుడూ.. చేయబోమని అన్నారు. ఎవరైనా స్వతహాగా వస్తే తప్ప.. హిజ్రాలుగా మార్చమని చెప్పారు. కానీ.. ఏదో మాఫియా బలవంతంగా ఆపరేషన్లు చేయిస్తున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.
తామే కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. దుర్భర జీవితాన్ని గడుపుతున్నామని చెప్పారు. అటువంటిది.. ఒకరిని హిజ్రాలుగా మార్చే పనులు ఎందుకు చేస్తామని ప్రశ్నించారు. ప్రియుడు మోసం చేశాడన్న కారణంతోనే.. శ్రీలేఖ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు.. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: